జనత గ్యారేజీ లో ఎన్టీఆర్ కొరటాల

ఎన్టీఆర్ – కొరటాల సినిమా అని చాల రోజుల నుండి న్యూస్ బాగా వినపడుతుంది.ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఎల్లుండి జరగనుంది. ఈ సినిమా కి ” జనత గ్యారేజ్ – ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును ” అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సినిమా లో ఎన్టీఆర్ పాత్ర చాల కొత్తగా ఉంటుందని , అందుకే ఇలాంటి టైటిల్ ఎంచుకున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా కి శ్రీమంతుడు టీం మొత్తం పని చేస్తుందని సమాచారం. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా అందించిన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. ఆదివారం ఉదయం 10 గంట 45 నిమిషాలకు సినిమా ముహూర్తం అని నిర్ణయించారు. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో షూటింగ్ పూర్తి చేసుకోగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది అని తెలుస్తుంది. జనత గ్యారేజ్ అనే టైటిల్ అభిమానులకి సైతం బాగా నచ్చింది. ఇంకో వైపు కొరటాల ఈ సినిమా ని ఎలా హేండిల్ చేస్తాడు అనే ఆసక్తి జనాల్లో ఉండటం విశేషం. ఏది ఏమైనా ఎన్టీఆర్ టెంపర్ నుండి మంచి కథల్ని టైటిల్స్ ని ఎంచుకొని కొత్త అభిమానులని పెంచుకుంటున్నాడు.

Leave a comment